Tirumala Laddu Probe Sit Chief Appointment: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు విచారణ కోసం సిట్ ఏర్పాటు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం సిట్ ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది.. సిట్ చీఫ్, సభ్యుల ఎంపికపై డీజీపీతో చంద్రబాబు చర్చించారు. సిట్ చీఫ్‌గా ప్రధానంగా ఇద్దరు ఐపీఎస్‌ల పేర్లు వినిపిస్తున్నాయి.