తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ రంగంలోకి దిగింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దినేష్ కుమార్ తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ సిబ్బంది దినేష్ కుమార్‌కు స్వాగతం పలికారు. రాత్రికి తిరుమలలో బస చేయనున్న దినేష్ కుమార్.. బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం విచారణ ప్రారంభించనున్నారు.