తిరుమలలో మరో అపచారం చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారం, రాజకీయ కార్యక్రమాలు , వ్యాఖ్యలు, రీల్చ్ చేయటం తిరుమలలో నిషేధం. అయితే తమిళనాడుకు చెందిన ఓ భక్తురాలు తిరుమలలో ఎన్నికల ప్రచారం నిర్వహించటం ఇప్పుడు విమర్శలకు కారణమవుతోంది. నాదనీరాజనం వద్ద టీవీకే పార్టీ సింబల్ అయిన విజిల్ వేస్తూ విజయ్ టీవీకే పార్టీకి ఓటేయాలని ఆ మహిళ కోరుతున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై భక్తులు మండిపడుతున్నారు.