Sadgamaya Program In TTD Schools: టీటీడీ పాఠశాలల్లో విద్యార్థులకు సద్గమయ కార్యక్రమం ద్వారా దైవభక్తి, నైతిక విలువలు పెంపొందించేందుకు ఈ నెల 16 నుంచి 19 వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు టీటీడీ ఈవో జె శ్యామల రావు తెలిపారు. విద్యార్థుల్లో క్రమశిక్షణను అలవాటు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. భగవద్గీత సారాంశాన్ని సరళంగా బోధించాలని, సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలియజేయాలని అధికారులకు సూచించారు. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవం వైభవంగా జరిగింది.