విజయవాడ నుంచి తిరుమలకు వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ ప్రకటించింది. విజయవాడ నుంచి తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి వెళ్లేవారి కోసం ప్యాకేజీ తీసుకువచ్చింది. ఈ ప్యాకేజ్‌లో భాగంగా కంఫర్ట్, స్టాండర్డ్ తరగతులలో ట్రైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలను ఐఆర్‍సీటీసీ అధికారిక వెబ్ సైట్ సందర్శించాలని సూచించింది. మరోవైపు యాత్రికుల కోసం ఐఆర్‌సీటీసీ అనేక ప్యాకేజీలు తీసుకువస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి వెళ్లేవారి కోసం ఈ ప్యాకేజీ తీసుకువచ్చింది.