Tirumala Heavy Devotees Rush: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.. రెండు రోజులుగా భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో కొండపై రద్దీ కనిపిస్తోంది.. సర్వ దర్శనం భక్తులకు దర్శనం 20 గంటలకుపైగా సమయం పడుతోంది. వరుస సెలవులతో పాటుగా వీకెండ్ కూడా ఉండటంతో భక్తుల రద్దీ మరింత పెరుగుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేసింది.. క్యూ లైన్లలో భక్తులకు పాలు, మంచినీళ్లు అల్పాహారం అందిస్తున్నారు.