తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు: అదంతా ఫేక్.. నమ్మొద్దు.. భక్తులకు టీటీడీ రిక్వెస్ట్

2 months ago 8
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. డిసెంబర్ 30 నుంచి పది రోజుల పాటు శ్రీవారి భక్తులకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనుంది టీటీడీ. మొదటి మూడు రోజులకు టోకెన్లు కూడా కేటాయించింది. అయితే టోకెన్లు లేని వారిని తిరుమలకు రానివ్వరంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ప్రచారంపై టీటీడీ స్పందించింది. టోకెన్లు లేకపోయినా తిరుమలకు రావచ్చని.. తిరుమలకు రావద్దని చెప్పే అధికారం ఎవరికీ లేదని క్లారిటీ ఇచ్చింది. అయితే టోకెన్లు లేని వారికి మొదటి మూడు రోజులు దర్శనాలకు అనుమతి లేకపోవటంతో భక్తులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
Read Entire Article