టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు.. తిరుమల శ్రీవారి లడ్డూ కౌంటర్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్వయంగా వెళ్లి భక్తుల నుంచి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత బూందీ పోటును కూడా సందర్శించారు. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి.. ఏర్పాట్లపైనా టీటీడీ ఛైర్మన్ వ్యాఖ్యానించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.