TTD Seeks Vegetable Donors For Varieties: తిరుమలలో అన్నప్రసాదాల తయారీకి వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి పంపుతున్న కూరగాయల దాతల సహకారాన్ని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరి అభినందించారు. స్థానిక అన్నమయ్య భవనంలో కూరగాయల దాతలతో సమావేశమై వారిని సత్కరించారు. శ్రీవారి భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని స్థానిక ఆస్థాన మండపంలో టీటీడీ ఆరోగ్య, ఎస్టేట్ విభాగాలు, ఆహార భద్రత విభాగంతో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఈవో అన్నారు.