Ysrcp Leader Photo Shoot In Tirumala: తిరుమల శ్రీవారి ఆలయం ముందు రాజకీయ నేత ఫోటో షూట్ చేశారు. నలుగురు వ్యక్తిగత ఫొటోగ్రాఫర్లతో ఆలయ ప్రాంగణంలో ఫొటోషూట్ నిర్వహించారు. ఆలయం ముందు హడావిడి చేశారు.. కొందరు భక్తుల్ని వారిని ప్రశ్నించారు. తిరుమల ఆలయం సమీపంలో ఇలా ఫోటోలు తీసుకోకూడదనే నిబంధన ఉంది.. కానీ కొందరు నిబంధనల్ని ఉల్లంఘించి ఫోటో షూట్‌లు చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి అంశం వివాదం కాగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.