తిరుమల శ్రీవారి ఆలయంలో ఆకట్టుకున్న పుష్పాల అలంకరణ

2 weeks ago 5
తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫల, పుష్పాలంక‌ర‌ణ‌లు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందుకోసం 8 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ ఉపయోగించారు. శ్రీవారి ఆలయం లోపల విభిన్న రకాల పండ్ల గుత్తులు, అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. ఆలయం వెలుపల గొల్ల మండపం పక్కన ఏర్పాటు చేసిన ప‌ల్ల‌కిలో శ‌య‌నిస్తున్న శ్రీ‌నివాసుడి ఇరువైపుల గ‌రుఖ్మంతుడు, హ‌నుమంతుడి రూపాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ఉగాది రోజున ప్ర‌కృతిని ఆస్వాదిస్తున్న రాధాకృష్ణులు, వేణుగానం చేస్తున్న చిన్ని కృష్ణుడు, తోట‌లో మిత్రుల‌తో క‌లిసి మామిడిపండ్ల‌ను తింటున్న చిన్ని కృష్ణుడు, బాల శ్రీ రాముడు, ఆంజ‌నేయుడు వంటి రూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆలయం బ‌య‌ట‌ భక్తులు తమ సెల్ ఫోన్ల‌లో ఈ ఫలపుష్ప ఆకృతులతో ఫొటోలు దిగుతూ ఉల్లాసంగా గడిపారు.
Read Entire Article