Tirumala Darshan Tokens: తిరుమల శ్రీవారి దర్శనానికి దేశ, విదేశాల నుంచి భక్తులు ప్రతి రోజూ కొండకు వస్తుంటారు. కొందరు ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లు బుక్ చేసుకుంటారు.. మరికొందరు ప్రజా ప్రతినిధుల దగ్గర సిఫార్సు లేఖలపై దర్శన టికెట్లు పొందుతారు. అలాగే ఆఫ్‌లైన్‌లో తిరుపతిలో టోకెన్లు ఇష్తారు. కాకపోతే కొందరు భక్తులు మాత్రం అవగాహన లేకపోవడంతో దర్శనం, ఆర్జిత సేవలు, గదుల, లడ్డూల విషయంలో దళారులను నమ్మి మోసపోతున్నారు. ఇటీవల కాలంలో తిరుమలలో ఇలాంటి కేసులు చాలానే నమోదయ్యాయి.