తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సుల లేఖల అంశంపై టీటీడీ ఈవో జే శ్యామలరావు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖపై దర్శనం కేటాయింపుపై నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు.తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని ఖండించారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారస్సు లేఖలను స్వీకరిస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని.. వారానికి రెండు రోజులు తెలంగాణ ప్రజాప్రతినిదుల లేఖలు స్వీకరిస్తారని కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే అన్నారు.