Tirumala Srivari Angapradakshinam Tokens Lucky Dip: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. తిరుపతి అర్బన్, తిరుమలకు చెందిన స్థానికులు.. నేడు అంగ ప్రదక్షిణ ఆన్‌లైన్ టోకెన్లను టీటీడీ విడుదల చేస్తుంది. ఈ నెల 7 వతేదీకి సంబంధించిన టోకెన్లను స్థానికులు మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి లక్కీడిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సాయంత్రానికి మొబైల్‌కు మెసేజ్ వస్తుంది.. ఆ తర్వాత డిపాజిట్ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. శనివారం వీరిని అంగప్రదక్షిణ కోసం టీటీడీ అనుమతిస్తుంది.