Tirumala Vaikunta Ekadasi Darshans Cancelled: తిరుమలలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సమయంలో వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలు మినహా చంటిపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్‌ఆర్‌ఐల దర్శనాలు, ఇతర ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నామన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ వివిధ శాఖల ఉన్నతాధికారులతో అడిషనల్ ఈవో సమావేశ వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్షించారు.