Tirumala Temple To Closed On March 3: తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. మార్చి 3న చంద్రగ్రహణం కావడంతో.. ఉదయం 9 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేస్తారు. గ్రహణం ఆ రోజు మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 వరకు ఉంటుంది. అంతేకాదు అదే రోజు కుమారధార తీర్థ ముక్కోటి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏర్పాట్లపై టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది.