Tirumala Srivari Angapradakshinam Tokens Lucky Dip: టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.. ప్రతి శనివారం కేటాయిస్తున్న 250 శ్రీవారి ఆలయ అంగప్రదక్షిణ టోకెన్లను ఇకపై లక్కీడిప్ ద్వారా కేటాయించనున్నట్లు టీటీడీ తెలిపింది. తిరుపతి నగరవాసులతో పాటు తిరుమలవాసులకు వీటిని కేటాయిస్తారు. ఈ టోకెన్లు కావాల్సిన భక్తులు.. గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తమ ఆధార్ కార్డుతో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వీరికి సాయంత్రం 5 గంటలకు లక్కీడిప్ ద్వారా టోకెన్లు కేటాయిస్తారు.