TTD Eo On Tirumala Darshan More SSD Tickets: తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. అయితే సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల సంఖ్యను తగ్గించింది. అలాగే ఎస్‌ఎస్‌డీ టికెట్ల సంఖ్య కూడా పెంచింది. ఈ మేరకు టికెట్లకు సంబంధించి ఇటీవల తీసుకున్న నిర్ణయాలు టీటీడీ ఈవో జే శ్యామలరావు.. డయల్ యవర్ ఈవో కార్యక్రమంలో వెల్లడించారు. అలాగే తిరుమల శ్రీవారి బ్రహోత్సవాలు, పవిత్రోత్సవాలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు.