Tirumala Darshan Tickets: తిరుమల శ్రీవారిని నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకుంటారు. అయితే ప్రతి నెలా ఆన్‌లైన్‌లో భక్తుల కోసం దర్శన టికెట్లు, ఆర్జిత సేవ టికెట్లను విడుదల చేస్తోంది. అయితే తాజాగా భక్తులకు టీటీడీ మరో అద్భుతమైన అవకాశం కల్పించింది. మే నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి గదుల ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది. సోమవారం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. అంతేకాదు తిరుమల, తిరుపతిలో వసతి గదుల మే నెల కోటాను కూడా విడుదల చేస్తోంది.