Tirumala Srivari Mettu Devotees Huge Rush: తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు మార్గం దగ్గర భక్తులు బారులు తీరారు. వేలాదిమంది భక్తులు శ్రీవారి మెట్టు మార్గం దగ్గరకు తరలివచ్చారు.. అక్కడ దివ్య దర్శనం టోకెన్ల కోసం ఎగబడ్డారు. ఏం జరిగిందని ఆరా తీస్తే భక్తులు చెప్పిన విషయాలు తెలిసి అందరూ అవాక్కయ్యారు. కొందరు ఆటో డ్రైవర్లు దివ్య దర్శనం టోకెన్లు ఇప్పిస్తామని నమ్మ బలికి డబ్బుల్ని వసూలు చేసినట్లు చెప్పారు..