హీరోయిన్ జాన్వీకపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు జాన్వీకపూర్. బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహరియతో కలసి జాన్వీకపూర్ స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండలంలో వేద పండితులు వేదశీర్వచనం అందించారు. అలాగే ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఇక హాఫ్ శారీలో తిరుమలకు వచ్చిన జాన్వీకపూర్‌ను చూడటానికి భక్తులు ఆసక్తి చూపించారు.