తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి భట్టి స్వామివారి సేవలో పాల్గొన్నారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ కాస్త పెరిగింది. ఉదయాన్నే ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామిని దర్శించుకున్నారు.