సినీ నటుడు మంచు విష్ణు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం విఐపీ విరామం సమయంలోమంచు విష్ణు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. మంచు విష్ణును చూడటానికి ఈ సందర్భంగా భక్తులు ఆసక్తి చూపించారు.