మాజీ మంత్రి ఆర్కే రోజా తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో రోజా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ సిబ్బంది స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్బంగా తిరుమలలో రోజాతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు, మహిళలు ఆసక్తి చూపించారు.