తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు రావు రమేష్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా… ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. రావు రమేష్ ను చూసిన భక్తులు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. తమ అభిమాన నటుడిని కొందరైతే ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. టీటీడీ ఉద్యోగులు, భక్తులు, శ్రీవారి సేవకులకు ఫోటోలు దిగారు. అందరితో సరదాగా మాట్లాడారు.