Tirumala Temple Hundi Income: తిరుమల శ్రీవారిని నవంబర్‌లో 20.35 లక్షలమంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ కానుకలు ` రూ.111.30 కోట్లు వచ్చాయి.. అలాగే విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 97.01 లక్షలుగా ఉంది. నవంబర్ నెలలో తిరుమలలో అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య ` 19.74 లక్షలు కాగా.. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య ` 7.31 లక్షలు. ఈ మేరకు డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో జే శ్యామలరావు ఈ వివరాలను వెల్లడించారు.