Tirumala Google ChandraSekhar Rs 1 Crore: తిరుమల శ్రీవారికి గూగుల్ వైస్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ కోటి రూపాయల విరాళం అందజేశారు. దీనితో పాటు, టీటీడీ అనుబంధ ఆలయాలైన నందలూరు, తాళ్లపాకలలో జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నందలూరులో జూలై 5 నుండి 13 వరకు, తాళ్లపాకలో జూలై 6 నుండి 15 వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.