Tirumala Devotee Donated Truck: తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.. స్వామిని దర్శించుకుని కానుకలు, విరాళాలు టీటీడీకి అందజేసి మొక్కులు చెల్లించుకుంటారు. కొందరు బంగారం, వెండి, డబ్బుల్ని హుండీలో వేస్తారు.. మరికొందరు టీటీడీ ట్రస్ట్‌లకు విరాళాలను అందజేస్తుంటారు. తాజాగా మరో భక్తుడు తిరుమల శ్రీవారికి ఖరీదైన కానుకను అందజేశారు. ఈ మేరకు ఆలయం ముందు మినీ ట్రక్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీకి వాహనాన్ని అప్పగించారు.