TTD Set Up Tirumala Walkway Roof With German Sheets: తిరుమలకు నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు.. వీరిలో ఎక్కువమంది నడక మార్గంలో శ్రీవారి దర్శనానికి వస్తారు.. అయితే ఎండాకాలం రావడంతో నడకమార్గంలో వెళ్లే భక్తులు ఇబ్బందిపడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన టీటీడీ కీలక ఏర్పాట్లు చేసింది.. భక్తులకు ఉపశమనం కల్పించేలా జర్మన్ షీట్లతో తాత్కాలిక పైకప్పు ఏర్పాటు చేశారు.. వేసవి నుంచి ఉపశమనం దక్కింది అంటున్నారు భక్తులు.