తిరుమల శ్రీవారికి తమిళనాడు సంస్థల భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తం.. ఎంతంటే?

4 hours ago 1
టీటీడీకి మరో భారీ విరాళం అందింది. టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు తమిళనాడు సంస్థలు 81 లక్షలు విరాళంగా అందించాయి. చెన్నైకు చెందిన యాక్సెస్ హెల్త్ కేర్, అలాగే వర ఫ్యూచర్ ఎల్ఎల్పీ అనే సంస్థలు ఈ విరాళం అందించాయి. యాక్సెస్ హెల్త్ కేర్ 70 లక్షల రూపాయలు విరాళంగా అందించగా.. వర ఫ్యూచర్ ఎల్ఎల్పీ 11 లక్షలు విరాళంగా అందజేసింది. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కలిసి విరాళానికి సంబంధించిన చెక్కులను దాతలు అందించారు. ఈ సందర్భంగా వారిని టీటీడీ ఏఈవో అభినందించారు.
Read Entire Article