తెలంగాణ సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్లా విజయ్ కుమార్.. తిరుమల శ్రీవారికి అరుదైన కానుక సమర్పించారు. తిరుమల శ్రీవారికి అగ్గిపెట్టెలో పట్టే చీరను కానుకగా సమర్పించారు. శనివారం టీటీడీ ఈవో శ్యామలరావుకు ఈ చీరను చూపించిన విజయ్ కుమార్.. ఆదివారం శ్రీవారి హూండీలో సమర్పించనున్నారు. నల్లా విజయ్ కుమార్ గతంలోనూ ఇలాంటి చేనేత కళా అద్భుతాలు ఎన్నో తయారు చేశారు. అనేక బహుమతులు కూడా అందుకున్నారు. అయితే తిరుమల శ్రీవారికి అగ్గిపెట్టెలో పట్టే చీరను సమర్పించడం వారి తండ్రి నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఈ సంప్రదాయాన్ని విజయ్ కుమార్ కొనసాగిస్తున్నారు.