తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందింది. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు హైదరాబాద్ భక్తుడు భారీ విరాళం అందించారు. నిర్మాత సాయి కొర్రపాటి ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు 17 లక్షల రూపాయలు విరాళమిచ్చారు. టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరిని కలిసి ఆయనకు విరాళం తాలూకూ డీడీని అందజేశారు. మరోవైపు టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి గురువారం తిరుమలలో తనిఖీలు నిర్వహించారు. టెంకాయల విక్రయ కేంద్రం, డాలర్ల విక్రయ కేంద్రం, టీటీడీ ప్రచురణ విక్రయ కేంద్రాలను పరిశీలించి అక్కడి వివరాలు ఆరా తీశారు.