వడ్డీ కాసుల వాడు అని పిలుచుకునే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి.. రాష్ట్రంలోని వారే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన భక్తులు భారీగా విరాళాలు సమర్పిస్తారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు భారీ కానుక ఇచ్చారు. 22 కిలోల వెండితో చేసిన భారీ గంగాళాన్ని కానుకగా సమర్పించారు. దీని విలువ రూ. 30 లక్షలు ఉంటుందని టీటీడీ తెలిపింది. మరోవైపు, సోమవారం 66,322 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. రూ.3.74 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.