తిరుమల శ్రీవారికి కాకినాడ, విజయవాడకు చెందిన భక్తులు విరాళాలు సమర్పించుకున్నారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును కలిసి విరాళాలకు సంబంధించి డీడీలను అందించారు. విజయవాడ భక్తుడు రూ.10 లక్షలు, కాకినాడకు చెందిన భక్తుడు రూ.6 లక్షలు చొప్పున టీటీడీకి విరాళాలు అందించారు. ఈ సందర్భంగా దాతలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు అభినందించారు. మరోవైపు ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన బుక్‌లెట్‌ను టీటీడీ ఛైర్మన్ ఆవిష్కరించారు.