Rs 1.20 Crore Donation To Ttd In Tirumala: హైదరాబాద్‌కు చెందిన భక్తుడు తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందించారు. మాక్స్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన బి.వి.వి.ఎస్.ఎన్.రాజు టీటీడీకి రూ.1.20 కోట్ల విరాళం ఇచ్చారు. ఈ విరాళంలో రూ.44 లక్షలు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఒకరోజు అన్నప్రసాద వితరణకు ఇచ్చారు. మరో రూ.76 లక్షలు శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు అందించారు.