తిరుమల శ్రీవారికి మరోసారి భారీ విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన భక్తుడు ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు భారీ విరాళం అందించారు. శ్రీనివాసులు రెడ్డి అనే భక్తుడు ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం అందించారు. గతంలోనూ ఈయన టీటీడీకి విరాళాలు అందించారు. గతంలో 30 లక్షల వరకూ విరాళాలు సమర్పించగా.. తాజాగా అందించిన మొత్తంతో కలిపి ఇప్పటి వరకూ టీటీడీకి రూ.40 లక్షలు విరాళం అందించారు శ్రీనివాసులు రెడ్డి. ఈ నేపథ్యంలో టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి ఆయనను అభినందించారు.