Tirumala TTD Rs 2 Crore Donation: తిరుమల శ్రీవారికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ట్రినిటీ కంబైన్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.2 కోట్ల విరాళం అందజేసింది. దివంగత ఐఆర్ఎస్ అధికారి వైవీఎస్ఎస్ భాస్కర్ రావు తన ఆస్తిని స్వామివారికి ధారపోశారు. ఇందులో 3 కోట్ల విలువైన ఇల్లు, 66 లక్షల నగదు ఉన్నాయి. విజయవాడలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జూలై 26 నుండి 31 వరకు అష్టబంధన జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణ వైభవంగా జరగనుంది.