తిరుమలలో భక్తుల కోసం టీటీడీ ఏర్పాటు చేసిన స్మార్ట్ ఫుట్‌వేర్ ట్రాకింగ్ సిస్టమ్ మంచి ఫలితాలను ఇస్తోంది. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ విధానం అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ ఎన్ని లావాదేవీలు జరిగాయనే వివరాలను టీటీడీ వెల్లడించింది. ఈ వ్యవస్థ ద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందించటంతో పాటుగా తిరుమలలో పరిశుభ్రతను మెరుగుపరుస్తున్నామని తెలిపింది. రాబోయే రోజులలో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.