100 New Electric Buses To Run Tirumala Very Soon: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు కాలుష్య నియంత్రణ దిశగా టీటీడీ అడుగులేస్తోంది. ఈ మేరకు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగంపై అధికారులు దృష్టి సారించారు. కొత్తగా 100 బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ-మౌలిక వసతులకు రూ.50 కోట్లు కేటాయించారు. న్యూటన్ అనే సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులతో ట్రయల్ రన్.