Tirumala Vaikunta Dwara Darshan Parking Places: తిరుమల శ్రీవారి ఆలయంలో.. జనవరి 10వ తేది నుంచి 19వ తేది వరకు నిర్వహించనున్న పది రోజుల వైకుంఠద్వార దర్శనాలకు భక్తుల్ని అనుమతిస్తారు. ఈ మేరకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది.. వీఐపీలు, భక్తలు కోసం పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. యంబీసీ, ఔటర్ రింగ్ రోడ్ , రామ్ భగీచా ఏరియా, పరకామణి భవనం, అర్చక నిలయం సమీపంలో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. ఈ పార్కింగ్ ప్రాంతాలను టీటీడీ ఈవో పరిశీలించారు.