తిరుమలను కేంద్రపాలిత ప్రాంతం చేయాలి.. కేఏ పాల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

2 months ago 4
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. తిరుమల లడ్డూ వివాదంపై కేఏ పాల్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. తిరుమలను కేంద్రపాలిత ప్రాంతం చేయాలంటూ కేఏ పాల్ గతంలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పరిశీలించిన సుప్రీంకోర్టు.. మనదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయని.. అన్నింటినీ ప్రత్యేక రాష్ట్రాలు చేయలేమని స్పష్టం చేసింది. అనంతరం పిటిషన్ కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై స్పందించిన కేఏ పాల్.. రివ్యూ పిటిషన్ వేస్తానని చెప్పారు.
Read Entire Article