Tirumala Cool Weather: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తిరుమలలో వాతావరణం మారిపోయింది. తిరుమలను దట్టమైన పొగ కమ్మేసింది.. శ్రీవారి సన్నిధితో పాటు ఆలయ పరిసరాలలో మంచు ఉంది. తిరుమల కొండల్ని కూడా మంచు కమ్మేయడంతో.. ఆకాశం కిందకు దిగి వచ్చినట్లుగా కనిపిస్తోంది. భక్తులు ఈ కూల్ వెదర్.. ఆహ్లాదకరమైన వాతావరణంతో సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. మరోవైపు అల్పపీపడనం ప్రభావంతో తిరుమలలో కూడా రెండు, మూడు రోజులు వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు.