Tirumala No Rush: తిరుమలలో పరిస్థితిమారిపోయింది.. రెండు వారాల తర్వాత రద్దీ తగ్గిపోయింది. ఆదివారం కూడా భక్తుల రద్దీ కనిపించగా.. సోమవారం ఉదయానికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం నేరుగా భక్తుల్ని క్యూ లైన్‌లోకి అనుమతిస్తున్నారు.. వైకుంఠం క్యూ కాంప్లెక్సుల్లో కూడా పెద్దగా రద్దీ కనిపించడం లేదు. చాలా రోజుల తర్వాత భక్తుల రద్దీ తగ్గడంతో.. దర్శనం త్వరగా పూర్తవుతోంది. ఆదివారం మాత్రం ఏకంగా 82వేలమంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.