తిరుమలలో మరోసారి ఫోటో షూట్ వివాదం చెలరేగింది. కర్ణాటకకు చెందిన బళ్లారి ఎమ్మెల్యే తిరుమలలో ఫోటో షూట్ నిర్వహించినట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. బళ్లారి ఎమ్మెల్యే భరత్‌రెడ్డి, అతని సిబ్బంది టీటీడీ సిబ్బంది చెప్పినా వినుకుండా శ్రీవారి ఆలయం వద్ద ఫోటోలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు టీటీడీ నిబంధనల ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఫోటో షూట్ పూర్తిగా నిషేధం. అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.