తిరుమలలో జోరువాన.. గొడుగు వేసుకుని వెళ్లిపోయిన అల్లు అర్జున్ భార్య

1 month ago 6
తిరుమల శ్రీవారిని గురువారం పలువురు వీఐపీలు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో సినీ నటి రాధిక, అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం అందించారు. అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మరోవైపు తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తిరుమలలో భారీవర్షం కురుస్తోంది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే తిరుమల శ్రీవారి దర్శనం పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి గొడుగు పట్టుకుని వెళ్లిపోయారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
Read Entire Article