తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు బుధవారం తిరుమలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వరాహస్వామి విశ్రాంతి భవనం వద్ద ఉన్న దుకాణాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు బుధవారం పరిశీలించారు. దుకాణాదారుల లైసెన్సులను తనిఖీ చేశారు. ఇందులో కొన్ని ఆక్రమణలను గుర్తించిన టీటీడీ ఛైర్మన్.. ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. కేటాయించిన స్థలంలోనే వ్యాపారాలు చేసుకోవాలని.. నిబంధనలు మీరితే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు.