తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తమిళ హాస్య నటుడు సంతానం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలోస్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు ఇచ్చి సత్కరించారు. మరోవైపు పలు డబ్బింగ్ సినిమాల ద్వారా సంతానం తెలుగు ప్రేక్షకులకు కూడా చిరపరిచితులయ్యారు.