తిరుమలలో రాంబగిచా గెస్ట్ హౌస్ దగ్గర నాగుపాము ప్రత్యక్షమైంది. ఆరు అడుగుల నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. నాగు పామును చూసిన భక్తులు., సిబ్బంది పరుగులు తీశారు. అక్కడ ఉన్న విజిలెన్స్ సిబ్బంది స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న భాస్కర్ నాయుడు పామును పట్టుకునే ప్రయత్నం చేయగా.. తోకను ముట్టుకోగానే పడగవిప్పిన నాగు కాటు వేసే ప్రయత్నం చేసింది.. భాస్కర్ నాయుడు తప్పించుకున్నారు. ఆ తర్వాత ఆయన పామును పట్టుకుని తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.