Tirumala Sanitation Workers Eating Non Veg: తిరుమల మెట్ల మార్గంలో టీటీడీ సిబ్బంది మాంసాహారం తినడం భక్తులకు ఆగ్రహం తెప్పించింది. ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తామని భక్తులు హెచ్చరించగా, సిబ్బంది బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. ఈ అపచారంపై టీటీడీ అధికారులు స్పందించారు. మాంసాహారం తిన్న ఇద్దరు ఉద్యోగులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటుగా ఉద్యోగాల నుంచి తొలగించినట్లు తెలిపారు. మరోవైపు, తిరుచానూరులో కార్తీక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.