Tirumala Marriage Sub Registrar Office Issue: తిరుమలలో వివాహం చేసుకునే జంటలకు వెంటనే సర్టిఫికేట్ అందిస్తున్నారు.. దీని కోసం ప్రభుత్వం మ్యారేజ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ కొత్త జంటల దగ్గర నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో కొత్త జంట ఆరోపణలు చేయడంతో టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులు తనిఖీలు చేపట్టగా.. ఒకరి దగ్గర అదనంగా డబ్బులు ఉన్నట్లు గుర్తించారు.